ఒంగోలు, మంగళవారం:
ప్రకాశం జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా పారుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘గోల్డెన్ షేక్ హ్యాండ్ మీట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఒంగోలు నగరంలోని సరోవరా హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లాలోని పలువురు అధ్యాపకులు, “Academic chains & pros” పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సమావేశం విద్యారంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చకు వేదికగా నిలిచింది.
అధ్యాపకులతో నేరుగా మమేకమైన జిల్లా కొ హెడ్
సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాశం జిల్లా హెడ్ శ్రీమతి చుండి సుధా కామేశ్వరి గారు
విద్యారుల భవిష్యత్‌పై జిల్లా హెడ్ సుధా కామేశ్వరి గారి సందేశం
ఈ సందర్భంగా శ్రీమతి చుండి సుధా కామేశ్వరి గారు
(W/o శ్రీ చుండి తిరుమలేశ్వరావు గారు) మాట్లాడుతూ,
పారుల్ యూనివర్సిటీ విద్యార్థుల జీవితాల్లో తీసుకొస్తున్న మార్పులపై అవగాహన కల్పించారు.
విద్య అనేది కేవలం డిగ్రీకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, వృత్తిపరమైన దృక్పథం పెంపొందించే విధంగా పారుల్ యూనివర్సిటీ పనిచేస్తోందని ఆమె వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పారుల్ యూనివర్సిటీ అందిస్తున్న అకడమిక్ వాతావరణం, మారుతున్న కాలానికి అనుగుణంగా రూపొందించిన కోర్సులు, విద్యార్థి కేంద్రిత విధానాలపై ఆమె స్పష్టతనిచ్చారు.
కరోనా కాల అనుభవాలపై జిల్లా కొ హెడ్ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా శ్రీ చుండి తిరుమలేశ్వరావు గారు మాట్లాడుతూ, కరోనా కాలంలో విద్యారంగం ఎదుర్కొన్న మార్పులు, సవాళ్లు తనను ఆలోచింపజేశాయని తెలిపారు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, అధ్యాపకుల తో కలిసి విద్యార్థుల భవిష్యత్‌ను మరింత బలంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పారుల్ యూనివర్సిటీ(వడోదర, గుజరాత్ మరియు గోవా క్యాంపస్)లు పని చేస్తున్నాయని తెలిపారు.
విద్యారంగంలో భాగస్వామ్యానికి ప్రాధాన్యం
ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ మీట్ ద్వారా విద్యా అధ్యాపకులు, “Academic chains & pros”, పారుల్ యూనివర్సిటీల మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు హైలైట్ చేశారు.
📌 విద్యారంగంలో సానుకూల మార్పుకు నాంది
ఈ సమావేశం ద్వారా జిల్లాలోని అధ్యాపకులతో అభిప్రాయాలను పంచుకుని, విద్యార్థుల భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. పారుల్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో విద్యారంగంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలికిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
📌 ముఖ్యాంశాలు (హైలైట్స్)
▪ NAAC A++ గుర్తింపు పొందిన పారుల్ యూనివర్సిటీ(వడోదరా,గుజరాత్ మరియు గోవా క్యాంపస్)లు.
▪ విద్యార్థుల భవిష్యత్‌పై అవగాహన కల్పించిన సుధా కామేశ్వరి గారు
▪ విద్యారంగ అభివృద్ధిపై దిశానిర్దేశం చేసిన జిల్లా కొహెడ్ శ్రీ చుండి తిరుమలేశ్వరావు గారు
▪ అధ్యాపకులు మరియు “Academic chains & pros” ల తో సమావేశం
▪ ప్రకాశం జిల్లాలో విద్యారంగానికి కొత్త దిశ




No comments:
Post a Comment